TGSRTC | వేలేరు : వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామానికి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసు సేవలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఎర్రబెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ముద్దసాని వరుణ్ అన్నారు. ఆర్టీసీ బస్సు సేవలను గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సోమవారం హుజురాబాద్ డిపో నుండి ఎర్రబెల్లి గ్రామానికి ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు సర్వీసు సేవలను గ్రామస్థులతో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రబెల్లి గ్రామానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు.
ఎర్రబెల్లి గ్రామానికి బస్సు సర్వీసును ఏర్పాటు చేయడంలో మంత్రి పొన్నం కృషి చేశారని.. వారికి ఎర్రబెల్లి గ్రామస్థుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలేరు శ్రావణ్, దస్తరి కిషోర్, నలివేల దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు