MLA Naini Rajender reddy | హనుమ కొండ చౌరస్తా, సెప్టెంబర్ 13 : 5వ ఓపెన్ నేషనల్ అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు వరంగల్ ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 16 నుంచి 18 వరకు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లో నిర్వహిస్తున్నామని.. సమిష్టి కృషితో అథ్లెటిక్స్ పోటీలను విజయవంతం చేసేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సాంగపాణి తెలిపారు.
దేశవ్యాప్తంగా 100 మంది అంతర్జాతీయ అథ్లెట్లతో..
శనివారం హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అథ్లెటిక్స్అసోసియేషన్, క్రీడాసంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో వరంగల్‌లో జరుగనున్న జాతీయ అథ్లెటిక్స్పోటీలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ.. జాతీయ అథ్లెటిక్స్పోటీల నిర్వహణపై ఈ నెల 15, 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవనున్నట్లు వారు చెప్పారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో దేశవ్యాప్తంగా 100 మంది అంతర్జాతీయ అథ్లెట్లతో సహా 800 మంది అథ్లెట్లు పాల్గొంటారని తెలిపారు.
అథ్లెటిక్స్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 25 మంది సాంకేతిక అధికారులు, 70 మంది రాష్ట్ర సాంకేతిక అధికారులు, 25 మంది స్థానిక అధికారులు, 50 మంది వాలంటీర్లు పాల్గొంటారని చెప్పారు. ఛాంపియన్షిప్ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందని, వివిధ ప్రదేశాల నుంచి డ్రాఫ్ట్ చేయబడిన సాంకేతిక అధికారులు, ఏఎఫ్ఐ అధికారులు ఫొటో ఫినిష్ అధికారులు, లైవ్ స్ట్రీమింగ్ బృందానికి హోటల్ వసతి కల్పించనున్నట్లు తెలిపారు.
అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు వరంగల్‌లో జూనియర్ నేషనల్స్, ఆలిండియా క్రాస్ కంట్రి రేష్, ఓపెన్ నేషనల్స్, సౌత్‌జోన్ ఇంటర్ స్టేట్ ఛాంపియన్‌షిప్‌లు, అనేక రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లు వంటి జాతీయస్థాయి అథ్లెటిక్స్ఛాంపియన్షిప్లను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి గుగులోతు అశోక్‌కుమార్ నాయక్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మహమ్మద్ అజిజ్ఖాన్, హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వరద రాజేశ్వర్‌రావు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
Edupayala Temple | పెరిగిన వరద.. వనదుర్గ ఆలయం మరోసారి మూసివేత
Rayapole | కొత్తపల్లిలో పడకేసిన పారిశుధ్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
Tragedy | రెండేళ్ల కూతుర్ని పాతిపెట్టి.. ప్రియుడితో పరారైన మహిళ.. మూడు నెలల తర్వాత బయటపడ్డ నిజం!