Vivek Venkataswamy | హనుమకొండ చౌరస్తా, జనవరి 10: రాబోయే కాలంలో తెలంగాణ గ్రామీణ జిల్లాల క్రీడాకారులు ఐపీఎల్ స్థాయికి ఎదగాలని తెలంగాణ గనులు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఇండస్ట్రీ సౌజన్యంతో ఫేస్-2 విభాగంలో మూడు రోజులుగా కరుణాపురంలోని వంగాలపల్లి వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న కాక వెంకటస్వామి మెమోరియల్ టీ-20 పోటీల్లో ముగింపు కార్యక్రమాలకి గడ్డం వివేక్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
కరీంనగర్ చివరి మ్యాచ్‌ను ఆదిలాబాద్‌ల మధ్య మ్యాచ్‌ను టాస్ వేసి ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లాలు నుంచి ఐపీఎల్స్థాయికి ఎదిగేలా తను హెచ్‌సీఏ ప్రెసిడెంట్ నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానని.. అందులో గత దశాబ్దంగా విశాఖ ఇండస్ట్రీ సౌజన్యంతో తనే స్వంతగా కాక వెంకటస్వామి మెమోరియల్ టోర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో పాల్గొన్న ఎంతోమంది ఇప్పటికే హెచ్‌సీఏలో వెలుగులోకి వస్తున్నందుకు కాక కుటుంబ సభ్యులకి మరింత ఆనందం కలిగించే విషయమన్నారు.
కుడా చైర్మెన్, మాజీ హెచ్‌సీఏ ప్రెసిడెంట్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేడియం నిర్మాణానికి నిధుల విషయంలో కానీ.. స్థల అనుమతులలో కానీ తను 2011 నుంచి ముందుపడి పనిచేస్తున్న విషయాన్ని పలు దఫాలుగా రాష్ట్ర ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా..
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలో స్టేడియం మంజూరు విషయమై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆమోదం తీసుకువచ్చామని త్వరలో స్టేడియం కల సాధ్యం కాబోతుందని తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. మూడు తరాలు క్రీడల్లోనే కాకుండా వైద్య, ఆరోగ్య విషయాల్లో కాక కుటుంబం నిరంతరం సేవచేస్తూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలుస్తుందని కొనియాడారు. జిల్లాల క్రికెట్ ఛైర్మన్ ఆగం రావు మాట్లాడుతూ.. గ్రామీణ జిల్లాలో ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ ద్వారానే క్రీడాకారులు వెలుగులోకి వస్తారని తెలిపారు.
వరంగల్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రెండు దశల్లో కాక వెంకటస్వామి మెమోరియా టోర్నమెంట్లో వరంగల్ జట్టు వేదిక చేయడమే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 జిల్లాలో ఏకకాలంలో టర్ఫ్ వికెట్ల మధ్య ఈ టోర్నమెంట్ నిర్వహణ చేసి హైదరాబాద్‌కి పోటీగా వరంగల్ జిల్లా నిలుస్తుందని, గ్రామీణ జిల్లాల క్రికెట్ అభివృద్ధిగాను వివేక్ వెంకటస్వామి తమపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని తెలిపారు. సభ అధ్యక్షుడిగా పెద్ది ప్రవీణ్‌గౌడ్ వ్యవహరించగా, ఉపాధ్యక్షుడు అచ్చ వెంకటేశ్వర్లు రావు, సదాశివు, తోట రాము, సంయుక్త కార్యదర్శి ఉపేందర్, కార్యవర్గ సభ్యులు అభినవ వినయ్, కోచ్ ప్రణయ్, శంకర్ పాల్గొన్నారు.
23 పరుగుల తేడాతో వరంగల్ పై హైదరాబాద్ గెలుపు..
తొలి మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఎదుర్కొని 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. హైదరాబాద్ జట్టులో వినీత్ పవర్ 3 సిక్సర్లతో 5 బౌండరీ సహాయంతో 65 పరుగులు భారీ లక్ష్యం నిర్దేశించారు. 165 పరుగుల లక్ష చేదనలో బరిలోకి దిగిన వరంగల్ జట్టు 19 ఓవర్లు మాత్రమే ఎదుర్కొని 141 పరుగులు సాధించి ఆలౌట్ కావడంతో 23 పరుగుల తేడాతో ఓటమి చెందింది.
వరంగల్ జిల్లాలో నిక్షిత్ బౌలింగ్‌లో 4 వికెట్లు బ్యాటింగ్‌లో 30 పరుగు సాధించింది. మిగిలిన వారు కీలక సమయంలో విఫలం చెందటంతో ఓటమి చెవిచూశారు. హైదరాబాద్ ప్లేయర్ వినీత్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ మంత్రి వివేక్ చేతుల మీదుగా అందించారు.
మరో మ్యాచ్‌లో
కరీంనగర్ ఆదిలాబాద్ జట్ల మధ్య జరగగా ఆదిలాబాద్ జట్టు నిర్ణీత 18 ఓవర్లు ఎదుర్కొని 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు సాధించింది. ఆదిలాబాద్ జట్టులో సంతోష్ కేవలం 44 బంతుల్లో 4 సిక్సర్లతో, 4 బౌండరీ సహాయంతో 133 పరుగులు చేసి రాణించాడు. 134 లక్ష చేదనలో బరిలోకి దిగిన కరీంనగర్ జట్టు ఎదుర్కుంటుంది.

