హైదరాబాద్ : అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాల ఊసే ఎత్తకపోవడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ధర్నాలు, ఆందోళనలతో తమ నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇవాళ నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించతలపెట్టారు. ఆ మేరకు ఇప్పటికే పిలుపునిచ్చారు. హైదరాబాద్–చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి మహా ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, వెంటనే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు.
దాంతో ప్రభుత్వం నిర్బంధాలకు దిగుతోంది. నిరుద్యోగులను ఎక్కడికక్కడ నిర్బంధించేందుకు భారీగా పోలీసులను మోహరించింది. పోలీసులు విద్యార్థులను అడుగడుగునా నిర్బంధిస్తున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో మోహరించిన పోలీసులను, కనిపించిన విద్యార్థులను నిర్బంధిస్తున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన నిరుద్యోగులు
హైదరాబాద్ – చిక్కడపల్లి లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి, మహా ధర్నా చేయాలని నిర్ణయించుకున్న నిరుద్యోగులు
జాబ్ క్యాలెండర్ మరియు 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన… https://t.co/uhsOwVj0oI pic.twitter.com/L35MNRtTao
— Telugu Scribe (@TeluguScribe) January 10, 2026