Arjun das | తన గంభీరమైన గొంతుతో సినీ అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు అర్జున్ దాస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన తాజాగా చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. తాజాగా అర్జున్ దాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని షేర్ చేశారు. “మీరు ఎవరినైనా చాలా ఎక్కువగా ప్రేమిస్తే వాళ్లు మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతారు. అసలు ఒకరు అంత ఈజీగా ఎలా మూవ్ ఆన్ అవుతారు?” అనే భావంతో ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం నెటిజన్లలో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఈ పోస్ట్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నిజంగానే అర్జున్ దాస్ లైఫ్‌లో ఏదైనా బ్రేకప్ జరిగిందా అనే చర్చ మొదలైంది. అభిమానులు, నెటిజన్లు కూడా దీనిపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇది నిజమైన వ్యక్తిగత అనుభవం కావచ్చని భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది ఏదైనా సినిమా ప్రమోషన్లో భాగమై ఉండొచ్చని అంటున్నారు. ఇటీవల అర్జున్ దాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన నటిస్తున్న భారీ చిత్రం OGలో ఒక కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా ద్వారా ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లో మరింత గుర్తింపు వచ్చింది.
అదే సమయంలో తమిళ్లో కూడా వరుస సినిమాలతో అర్జున్ దాస్ బిజీగా ఉన్నారు. విలన్ పాత్రలు, పవర్ఫుల్ క్యారెక్టర్స్‌లో తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆయనకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ బ్రేకప్ పోస్టు నిజంగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించినదేనా? లేక ఏదైనా ప్రాజెక్ట్ ప్రమోషన్లో భాగమా? అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో అభిమానులు మాత్రం అర్జున్ దాస్ నుంచే నేరుగా క్లారిటీ రావాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆయన చేసిన ఈ ఒకే ఒక్క పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.