తిరుమల : శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల ( Tirumala) లో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. వైకుంఠ ద్వార దర్శనాలు ( Vaikuntadwara Darsan ) ముగియడంతో భక్తుల రాక తగ్గిందని అధికారులు వెల్లడించారు. నిన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కేవలం 7 కంపార్టుమెంట్లలో మాత్రమే వేచియున్నారు.
టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని వివరించారు. నిన్న స్వామివారిని 67,678 మంది భక్తులు దర్శించుకోగా 18,173 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా చెల్లించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 3.82 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.