MLA Prakash Goud | వాడెవడో నాకు సంబంధం లేదు.. కన్న కొడుకుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
MLA Prakash Goud | ప్రేమ వివాహం విషయంలో తన తండ్రి నుంచి తమకు ప్రాణహాని ఉందని రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశాడని తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రేమ వివాహం చేసుకునేందుకు సిద్ధమైన తన కొడుకు సంతోష్ గౌడ్పైఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
MLA Prakash Goud | ప్రేమ వివాహం చేసుకునేందుకు సిద్దమయ్యాడనే కారణంతో కన్న కొడుకుపైనే రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దాడి చేయించడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న తమను తన తండ్రి చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని.. తన తండ్రి నుండి ప్రాణహాని ఉందంటూ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశాడు.
ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రేమ వివాహం చేసుకునేందుకు సిద్ధమైన తన కొడుకు సంతోష్ గౌడ్పైఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాడెవడో నాకు సంబంధం లేదు.. ఆ విషయం గురించి నేను మాట్లాడదలచుకోలేదు. సమయం వచ్చినప్పుడు మాట్లాడుతానంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నా తండ్రికి ఇష్టం లేదు : సంతోష్ గౌడ్
సంతోష్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. జులై 8న మాకు నిశ్చితార్థం కూడా అయింది. ఇదంతా మా తల్లిదండ్రులకు తెలుసు. వాళ్లంతా ఒప్పుకున్నరు. వాళ్లు సొంతంగా ప్రేమ పెళ్లి చేసేందుకు ఒప్పుకోలేదు.. కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లికి అనుమతిస్తున్నామని చెప్పారు. దీంతో మా అత్తమ్మవాళ్లతో కలిసి నిశ్చితార్థం పూర్తి చేసుకున్నాం. నేను ఇప్పటికే నెల రోజుల నుంచి వీళ్ల ఇంట్లోనే ఉంటున్నానని మా ఇంట్లో కూడా తెలుసు. కానీ నిన్న 40 మంది దాకా వచ్చి అత్తమ్మవాళ్లింటిపై దాడి చేశారు. వాళ్లు దాడి చేసినందుకు సాక్ష్యాధారాలు కూడా ఇక్కడున్నాయి. ఇదంతా కేవలం అమ్మాయి విషయం వల్ల జరుగుతుంది. నెల అవుతుంది.. నేను ఇక్కడున్నా అని వాళ్లకు తెల్వదా.. నేను పెళ్లి చేసుకునేది తెల్వదా..? వాళ్లకు ప్రతీ ఒక్కటి తెలుసు. తెలిసి కూడా ఇన్ని రోజులుగా లేనిది ఇవాళ ఎవరో అప్పులివ్వాలని అందరితో పిటిషన్లను ఇచ్చి ఇంటి ఆడవాళ్ల మీద దాడి చేయించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించాడు.
తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేదని.. ఈ నేపథ్యంలో తాను ప్రేమించిన యువతి ఇంటిపై తన తండ్రి అనుచరులతో దాడి చేయించి, తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని సంతోష్ గౌడ్ ఆరోపించాడు. ఏ క్షణమైనా తనను చంపే ప్రమాదం ఉందని, తనకు, తనకు కాబోయే భార్య కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతున్నాడు.
వాడెవడో నాకు సంబంధం లేదు
ప్రేమ వివాహం చేసుకునేందుకు సిద్ధమైన కన్న కొడుకు సంతోష్ గౌడ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
ఆ విషయం గురించి నేను మాట్లాడదలచుకోలేదు
సమయం వచ్చినప్పుడు మాట్లాడుతా
– కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ https://t.co/RsvmiSreW4 pic.twitter.com/Apgv9wauaK
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2026
Read Also :
Anushka Shetty | అనుష్క కోసం రాసిన కథ.. 12 ఏళ్ల తర్వాత ‘కింగ్ జాకీ క్వీన్’గా ప్రేక్షకుల ముందుకు..
Footballer | మ్యాచ్ ఆడుతుండగా ఫుట్‌బాలర్‌పై పిడుగు.. అక్కడికక్కడే దుర్మరణం..!
Pradeep Rawat | చివరి క్షణాలను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమైన ప్రదీప్ రావత్ కుమారుడు.. అంతా నెలన్నరలోనే జరిగిపోయింది..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

