హైదరాబాద్ : ఏడాదిలోగా రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీలు గుప్పించి మాటతప్పిన సీఎం రేవంత్‌రెడ్డిపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జాబ్ క్యాలెండర్ ఏది..? రెండు లక్షల ఉద్యోగాలు ఏవి..? అని మండిపడ్డారు. ఇవాళ ర్యాలీ నిర్వహించతలపెట్టిన నిరుద్యోగులను చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిర్బంధించడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ఈ ఆందోళన సందర్భంగా కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ఓ నిరుద్యోగి సీఎం రేవంత్‌రెడ్డిపై తన ఆవేదన వెళ్లగక్కాడు. ‘ఇది ప్రజా పాలన కాదు పనికిమాలిన పాలన’ అని, ‘ఆయన రేవంత్‌రెడ్డి కాదు, పనికిమాలిన రెడ్డి’ అని మండిపడ్డాడు. తనను విమర్శించినోళ్లను రేవంత్‌రెడ్డి ‘గుడ్డలూడదీసి కొడుతా..’ అంటారని, నిరుద్యోగులకు మాట ఇచ్చి మోసం చేసినందుకు రేవంత్ రెడ్డిని గుడ్డలూడదీసి కొట్టాలా..? అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.
తనది కొడంగల్ నియోజకవర్గమని, రేవంత్‌రెడ్డికి ఓటేసినందుకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా తన జీవితాన్ని నాశనం చేశాడని విమర్శించాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా కేవలం 5 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని గుర్తుచేశాడు. ఆ నిరుద్యోగి అక్రోశాన్ని కింది వీడియోలో చూడవచ్చు..