వెంకటాపురం(నూగూరు), జూలై 11 : ఇటీవల అడవిలో మందుపాతర పేలి గిరిజన వృద్ధుడు సోమం కామయ్య(65) గాయపడ్డారు. కాగా, శుక్రవారం ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఈ నెల 4న ములుగు జిల్లా ముకునూరుపాలెం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెదురుబొంగుల కోసం కామయ్య వెళ్లాడు.
తిరిగి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన మందుపాతరపై అడుగు వేయడంతో ప్రెషర్ బాంబు పేలి గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తీసుకెళ్లగా చికిత్సపొందుతూ శుక్రవారం కామయ్య మృతిచెందాడు.