జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్ సమీపంలో గల ఎల్ అండ్ టీ ఆఫీసులు అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. అంబటిపల్లి వద్ద ఎల్ అండ్ టీ సంస్థ తాత్కాలిక నిర్మాణాలతో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. కాగా ఆదివారం ఒక్కసారిగా నిప్పు అంటుకొని ఏడు గదులు కాలిపోయాయి. సమీపంలో పంట పొలాల్లో గడ్డికి నిప్పు అంటుకొని కార్యాలయాలు కాలిపోయాయని సిబ్బంది చెబుతున్నారు. కార్యాలయంలోని ఫైల్స్, కంప్యూటర్లు, ఫర్నిచర్ కాలిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Weather | ఈసారి ఖరీఫ్‌కు ఎల్‌నినో ఎఫెక్ట్.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం
MI vs RR | రాజస్థాన్ రాయల్స్ షాక్.. 33 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన ఆర్ఆర్