Advocate Mukheed | సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను అత్యంత దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ముఖీద్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రెస్ మీట్లో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ముఖీద్ మాట్లాడుతూ.. న్యాయవాదులపై గత కొన్ని రోజులుగా దాడులు ఎక్కువయ్యాయి. ప్రజల కోసం పని చేస్తున్న లాయర్లను దారుణంగా చంపేస్తున్నారు. ఖాజా మొయినుద్దీన్ ను హత్య చేసిన వారిపై సిట్ ఏర్పాటు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్ష పడేలా చెయ్యాలన్నారు.
ఖాజా మొయినుద్దీన్ కుటుంబానికి ప్రొటెక్షన్ ఇవ్వలేదు కాబట్టే హత్య చేశారు. ఖాజా మొయినుద్దీన్ హత్యలో పోలీస్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తుంది. ఖాజా మొయినుద్దీన్ హత్య చూస్తుంటే కొత్తవారు న్యాయవృత్తిలోకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. న్యాయవాదులకు స్ట్రాంగ్ ప్రొటెక్షన్ కావాలని ఎన్నో సార్లు పోరాటం చేశాము. న్యాయవాదులకు క్లియర్ ప్రొటెక్షన్ రావాలని మేము డిమాండ్ చేస్తున్నాము.న్యాయవాదులకు పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ రూమ్ ఏర్పాటు చేయాలి.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయిందన్నారు ముఖీద్.
పట్టపగలే మాజీ IPS అధికారి భార్యను హత్య చేశారు. మహమ్మద్ ఖదీర్ అనే న్యాయవాదిని అత్తాపూర్ లో హత్య చేశారు. న్యాయవాదులపై దాడి ప్రజాస్వామ్యానికి మంచి కాదు. జ్యుడీషియల్ వీక్ అయితే అన్ని వ్యవస్థలు వీక్ అవుతాయి. ఖాజా మొయినుద్దీన్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. వక్ఫ్ భూముల కాపాడేందుకు ఖాజా మొయినుద్దీన్ కృషి చేస్తున్నారు. ఖాజా మొయినుద్దీన్ దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని దుండగులకు సరైన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఖాజా మొయినుద్దీన్ కొడుకు ఫరాన్ కు ప్రొటెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఖాజా మొయినుద్దీన్ కుటుంబానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ సహకారం ఉంటుందని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ముఖీద్ భరోసానిచ్చారు.