Dehydration | వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు..
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్ సమస్యలు కూడా అధికమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది రోజంతా నీళ్లు తాగుతున్నప్పటికీ శరీరంలో నీటి కొరత లక్షణాలు కనిపిస్తూనే ఉంటాయని చెబుతున్నారు.
Dehydration | దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్ సమస్యలు కూడా అధికమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది రోజంతా నీళ్లు తాగుతున్నప్పటికీ శరీరంలో నీటి కొరత లక్షణాలు కనిపిస్తూనే ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా వేసవిలో అధిక చెమట వల్ల శరీరం నుంచి నీటితో పాటు అవసరమైన ఖనిజాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. దీంతో కేవలం నీరు తాగడం సరిపోకపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో తగినంత ద్రవాలు లేకపోతే మొదట కనిపించే లక్షణాల్లో అలసట ఒకటి. సరైన విశ్రాంతి తీసుకున్నప్పటికీ రోజంతా బలహీనంగా, నీరసంగా అనిపిస్తే అది డీహైడ్రేషన్ సంకేతంగా భావించాల్సి ఉంటుంది. శరీరంలో నీటి స్థాయిలు తగ్గిపోతే రక్తప్రసరణ మందగించి, ఆక్సిజన్, పోషకాలు శరీర భాగాలకు సరిగ్గా చేరవు. దీంతో శక్తి తగ్గి అలసట పెరుగుతుంది.
తరచూ తలనొప్పి వస్తుంటే..
వేసవిలో తరచూ తలనొప్పి రావడం కూడా డీహైడ్రేషన్‌కు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ద్రవ సమతుల్యత దెబ్బతింటే రక్తప్రసరణలో మార్పులు వచ్చి తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎండలో ఎక్కువసేపు తిరిగిన తర్వాత వచ్చే తలనొప్పిని నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు. మూత్రం గాఢ పసుపు రంగులో కనిపించడం లేదా సాధారణం కంటే తక్కువసార్లు మూత్ర విసర్జన జరగడం కూడా శరీరంలో నీటి కొరతకు సూచనగా భావించాలి. శరీరం నీటిని ఆదా చేసేందుకు ప్రయత్నించే సమయంలో మూత్రం మరింత కేంద్రీకృతమై ముదురు రంగులో కనిపిస్తుంది. నిపుణుల ప్రకారం మూత్రం రంగు ద్వారా శరీర హైడ్రేషన్ స్థాయిని సులభంగా అంచనా వేయవచ్చు. ఏకాగ్రత తగ్గడం, మతిమరుపు, మెదడు మందగించినట్టు అనిపించడం కూడా డీహైడ్రేషన్ వల్ల కలిగే సమస్యలలో ఒకటి. శరీరంలో నీటి శాతం స్వల్పంగా తగ్గినా మెదడు పనితీరుపై ప్రభావం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది, స్పందన మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నీళ్లు తాగుతున్నా దాహంగా ఉంటే..
చాలా నీళ్లు తాగుతున్నప్పటికీ దాహంగా అనిపించడం లేదా శరీరంలో బలహీనత తగ్గకపోవడం కూడా ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు సంకేతం అయ్యే అవకాశాలు ఉంటాయి. వేసవిలో చెమట ద్వారా సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు బయటకు వెళ్లిపోతాయి. కేవలం నీరు తాగడం వల్ల ఇవి తిరిగి భర్తీ కావు. అందుకే కొబ్బరి నీరు, ఓఆర్ఎస్ వంటి ఎలక్ట్రోలైట్ పానీయాలను కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తీవ్రమైన ఎండల సమయంలో శరీరం చెమట ద్వారా ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ఎక్కువగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియలో నీరు, ఖనిజాలను వేగంగా కోల్పోతుంది. ఇవి సకాలంలో భర్తీ కాకపోతే డీహైడ్రేషన్ సమస్య క్రమంగా తీవ్రమవుతుంది. నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఆహారంపైనా దృష్టి అవసరం..
వేసవిలో సరైన హైడ్రేషన్ కోసం నీటితోపాటు ఆహారంపైనా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. దోసకాయ, టమాటాలు, లెట్యూస్ వంటి నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు తీసుకోవాలని చెబుతున్నారు. పుచ్చకాయ, తర్బూజా వంటి పండ్లు శరీరాన్ని చల్లబరచడంలో సహాయపడతాయని పేర్కొంటున్నారు. నారింజలు ఎలక్ట్రోలైట్ సమతుల్యతకు ఉపయోగపడతాయని, ద్రాక్ష శరీరానికి తేమను అందించడంలో సహాయపడుతుందని తెలిపారు. అలాగే కార్బొనేటెడ్ శీతల పానీయాలు, అధిక చక్కెర కలిగిన డ్రింక్స్‌పై ఆధారపడొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి శరీరంలో నీటి కొరతను మరింత పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగడం, ఎక్కువసేపు దాహంగా ఉండకుండా చూసుకోవడం, కొబ్బరి నీరు లేదా ఓఆర్ఎస్ వంటి పానీయాలను తీసుకోవడం ద్వారా వేసవిలో డీహైడ్రేషన్ సమస్యను దూరంగా ఉంచవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Dehydration
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

