Nani | నాని–సుజీత్ ‘బ్లడీ రోమియో’లో హీరోయిన్గా లెనిన్ బ్యూటీ.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్?
Nani | టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్‌తో కలిసి ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో నటించనున్నారు.
Nani | టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్‌తో కలిసి ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో నటించనున్నారు. ఇప్పటికే ‘ఓజీ’తో తన మార్క్ చూపించిన సుజీత్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ‘బ్లడీ రోమియో’ అనే విభిన్నమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనుంది.
ఇప్పటివరకు ఈ సినిమాలో నాని సరసన ఎవరు హీరోయిన్గా నటించనున్నారనే అంశంపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేను ఈ ప్రాజెక్ట్ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. దర్శకుడు సుజీత్, నిర్మాతలు ఇప్పటికే భాగ్యశ్రీతో చర్చలు జరిపినట్లు, కథతో పాటు తన పాత్ర నచ్చడంతో ఆమె కూడా ఈ సినిమాకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. మాస్ మహారాజా రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తన స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్‌తో పాటు నటనతోనూ ఆకట్టుకున్న ఆమెకు మంచి గుర్తింపు లభించింది.
ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’, రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ వంటి చిత్రాల్లో నటించి తన పరిధిని పెంచుకున్నారు.ఇక అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘లెనిన్’ సినిమాతో భాగ్యశ్రీ బోర్సేకు మరింత క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో పాటు, సినిమా విజయం ఆమెకు వరుస అవకాశాలు తెచ్చిపెడుతోంది. ఒకవైపు వరుస విజయాలతో నాని మంచి ఫామ్‌లో ఉండగా.. మరోవైపు ‘ఓజీ’తో సుజీత్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఇద్దరి కలయికలో ‘బ్లడీ రోమియో’ తెరకెక్కనుండటంతో సినిమాపై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారన్న వార్త నిజమైతే నాని–భాగ్యశ్రీ జోడీకి ఇదొక కొత్త కాంబినేషన్ కానుంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్, ఎమోషన్, స్టైలిష్ టేకింగ్‌తో సుజీత్ ఈ సినిమాను ఏ స్థాయిలో తెరకెక్కిస్తారో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Bhagyashri Borse
- Nani
- Sujeeth
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

