బడ్జెట్ ధరలో బుల్లెట్
రాయల్ ఎన్ఫీల్డ్ బిగ్ ప్లాన్.. దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్‌ను షేక్ చేస్తున్నదిప్పుడు. 250సీసీ శ్రేణిలో బైక్‌లను ఆ సంస్థ తీసుకురాబోతున్నదని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొంటున్నాయి మరి. ప్రస్తుతం 350-650సీసీ శ్రేణిలోనే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 250సీసీ బైక్ వస్తే.. మార్కెట్లో ప్రత్యర్థి సంస్థలకు మరింత పోటీనేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
- మార్కెట్లోకి 250సీసీ రాయల్ ఎన్ఫీల్డ్?
న్యూఢిల్లీ, నవంబర్ 19: రాయల్ ఎన్ఫీల్డ్ బిగ్ ప్లాన్.. దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్‌ను షేక్ చేస్తున్నదిప్పుడు. 250సీసీ శ్రేణిలో బైక్‌లను ఆ సంస్థ తీసుకురాబోతున్నదని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొంటున్నాయి మరి. ప్రస్తుతం 350-650సీసీ శ్రేణిలోనే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 250సీసీ బైక్ వస్తే.. మార్కెట్లో ప్రత్యర్థి సంస్థలకు మరింత పోటీనేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2025-26) భారతీయ టూవీలర్ మార్కెట్లో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో తదితర సంస్థల వాటా పడిపోగా.. రాయల్ ఎన్ఫీల్డ్ మార్కెట్ షేర్ మాత్రం దాదాపు 3 శాతం పెరిగింది.
ఈ క్రమంలో 250సీసీ బైక్ ఎంట్రీ.. రాయల్ ఎన్ఫీల్డ్ వాహన విక్రయాలను పరుగులు పెట్టించవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి దేశీయంగా 75-125సీసీ టూవీలర్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. అయితే ఇటీవలికాలంలో 125సీసీని మించిన బైక్‌ల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నవారి సంఖ్య పెరిగింది. అయినప్పటికీ 350సీసీ స్థాయిదాకా వెళ్లడం లేదు. ఇందుకు ధరతోపాటు మైలేజీ కూడా ప్రభావం చూపుతున్నది. దీంతో 250సీసీ బైక్‌ను మరింత అందుబాటు ధరలో తేవడమేగాక, మెరుగైన మైలేజీని కూడా ఇచ్చేలా డిజైన్ చేస్తున్నట్టు సమాచారం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

