1500కోట్ల క్లబ్లో‘రామాయణ’
రణ్‌బీర్‌కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన పౌరాణిక ఇతిహాసం ‘రామాయణ’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తున్నది. కేవలం 14రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా 1500కోట్ల వసూళ్ల మైలురాయిని దాటింది.
రణ్‌బీర్‌కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన పౌరాణిక ఇతిహాసం ‘రామాయణ’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తున్నది. కేవలం 14రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా 1500కోట్ల వసూళ్ల మైలురాయిని దాటింది. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారతీయ చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. భారతీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లో కూడా ఈ సినిమా ప్రభంజనాన్ని సృష్టిస్తున్నది. నితేశ్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు 4000కోట్లతో రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించారు.
దేశీయ బాక్సాఫీస్వద్ద వెయ్యికోట్ల గ్రాస్
దేశీయ బాక్సాఫీస్ వద్ద వెయ్యికోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఆరో చిత్రంగా ‘రామాయణ’ నిలిచింది. అంతకుముందు బాహుబలి-2, కేజీఎఫ్-2, పుష్ప-2, ధురంధర్, ధురంధర్-2 చిత్రాలు ఈ రికార్డును అందుకున్నాయి. రణబీర్‌కపూర్, సాయిపల్లవి కెరీర్లో కూడా వెయ్యికోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి చిత్రమిదే కావడం విశేషం. భారతీయ బాక్సాఫీస్ వద్ద రెండో వారాంతంలో కూడా 196కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇక దక్షిణాదిలో కూడా ఒక్కో రాష్ట్రం నుంచి 50కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా ‘రామాయణ’ రికార్డు సృష్టించింది. గతంలో జవాన్, యానిమల్, ధురంధర్-2 వంటి చిత్రాలు దక్షిణాదిలో మంచి వసూళ్లు సాధించినప్పటికీ, ఈ స్థాయిలో భారీ కలెక్షన్స్‌ను రాబట్టలేకపోయాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

