హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ర్టానికి 11,59,915 ఇండ్లను కేటాయించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్సింగ్చౌహాన్కు మంత్రి పొంగులేటి వినతి పత్రాన్ని అందజేశారు.