Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ ప్రమోషన్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ హైప్‌ను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్, తొలి రెండు పాటలు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచగా.. ఇప్పుడు మూడో సాంగ్ ‘హల్లల్లల్లో’ వచ్చి సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. గత రెండు రోజులుగా ప్రోమోతోనే వైరల్ అయిన ఈ పాట.. తాజాగా పూర్తి వీడియో విడుదల కావడంతో మెగా అభిమానుల్లో మరింత జోష్ నింపింది. భోపాల్‌లో జరిగిన ‘పెద్ది కీ ఆవాజ్’ ఈవెంట్లో ఈ పాటను గ్రాండ్‌గా లాంచ్ చేస్తారని అభిమానులు భావించారు. అయితే అక్కడ ఆడియో వెర్షన్ మాత్రమే విడుదల చేశారు. దీంతో పూర్తి వీడియో కోసం ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు ఇప్పుడు మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. విడుదలైన కొద్ది సేపటికే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది.
“హల్లల్లల్లో… హల్లో హల్లల్లల్లో హల్లల్లో… బావ చీర చొక్కా చిక్కడిపోవాలో…” అంటూ సాగే లిరిక్స్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. రొమాంటిక్ టచ్‌తో పాటు మాస్ ఎనర్జీని కలిపి రూపొందించిన ఈ పాటలో రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన స్టైలిష్ స్టెప్పులు, రా అండ్ రస్టిక్ లుక్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ఈ పాటకు ప్రముఖ రచయిత అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా, గాయని రక్షిత సురేష్ తన గాత్రంతో ప్రత్యేకమైన ఫీల్ తీసుకొచ్చారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్, జాన్వీ కపూర్ కెమిస్ట్రీ పాటకు మరో ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
ఇక ‘పెద్ది’ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ‘చికిరి చికిరి’, ‘రయ్ రయ్ రా రా’ పాటల నుంచి ట్రైలర్ వరకు ప్రతి అప్డేట్ అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్‌పై చిత్రబృందం పదే పదే ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు రూపొందించిన ఈ ముగింపు సన్నివేశం ప్రేక్షకులకు భారీ సర్ప్రైజ్గా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రమోషన్స్ విషయంలో కూడా చిత్రబృందం ఎక్కడా తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా ప్రత్యేక ఈవెంట్లు నిర్వహిస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, విజయనగరం, హైదరాబాద్ నగరాల్లో వరుసగా భారీ ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతిబాబు, సాయికుమార్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.