GATE | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 9: నేషనల్ ఇనిష్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యయనార్థం ప్రవేశపెట్టిన ఉచిత గేట్ కోచింగ్ క్లాసులను ఇప్పుడు అన్ని వర్గాల విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులు, అలాగే నిట్, వరంగల్ పరిసర ప్రాంతాల ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ప్రయోజనం పొందవచ్చని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు.
ఈ కోచింగ్ కార్యక్రమం అన్ని ఇంజినీరింగ్ విభాగాలను కవర్ చేస్తూ ఈనెల 17 నుంచి జనవరి 9 వరకు వరకు 8 వారాలపాటు కొనసాగుతుందన్నారు. గేట్ పరీక్షకు సన్నద్ధమవుతున్న ప్రతి విద్యార్థికి సమాన అవకాశం, నాణ్యమైన మార్గదర్శకత్వం అందించాలనే నిట్ సంకల్పాన్ని ఈ విస్తరణ ప్రతిబింబిస్తుందన్నారు. ఆసక్తిఉన్న విద్యార్థులు సూచించిన మార్గదర్శకాలప్రకారం నమోదు చేసుకుని తరగతులను హాజరుకావచ్చన్నారు.
అప్లికేషన్ ఫారం, నిబంధనలు, ఇతర వివరాలు వరంగల్ నిట్ వెబ్సైట్లోని నోటిఫికేషన్ల విభాగంలో nitw.ac.in వద్ద అందుబాటులో ఉన్నాయని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు.
Anandhi | నేను ఓరుగల్లు పిల్లని.. పుట్టింది, పెరిగింది అంతా వరంగల్లోనే!
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం
Tornado | టోర్నడో బీభత్సం.. ఆరుగురు మృతి.. 800 మందికి గాయాలు