Tornado | బ్రెజిల్ (Brazil)లో టోర్నడో (Tornado) బీభత్సం సృష్టించింది. దక్షిణ బ్రెజిల్‌లోని రియో బోనిటో డో ఇగువా (Rio Bonito do Iguacu) పట్టణాన్ని అత్యంత శక్తివంతమైన సుడిగాలి (Tornado) అతలాకుతలం చేసేసింది. ఈ టోర్నడో బీభత్సానికి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు.
O tornado que engoliu Rio Bonito, no Paraná. O curioso é a relativa calmaria nos arredores, evento bastante concentrado mesmo. pic.twitter.com/KJRPjrribj
— ґуто 🇺🇦 (@gutoaqui) November 8, 2025
గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచిన భయంకరమైన గాలులకు పట్టణం చాలావరకూ తుడిచిపెట్టుకుపోయింది. 90 శాతం పట్టణం నాశనమైంది. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. కార్లు గాల్లో ఎగిరి పడ్డాయి. గాలుల తీవ్రతకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ టోర్నడో బీభత్సానికి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 800 మంది గాయపడినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. కాగా, ఈ విపత్తుకు అనేక మంది నిరాశ్రయులయ్యారు. ‘టోర్నడో బీభత్సం సృష్టించింది. పట్టణంలోని ఇళ్లు, పాఠశాలలను నాశనం చేసింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి..?’ అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
🚨 ATENÇÃO IMAGENS DO MOMENTO EM QUE O TORNADO 🌪️ ATINGE A CIDADE DE RIO BONITO DO IGUAÇU.
Até agora já foram identificados 9 mortos e 400 feridos, mais de 80% da cidade foi danificada, nesse que é sem dúvida o maior evento destrutivo de tornado da história do Brasil. pic.twitter.com/ZYxJ7A6CHL
— Bruno Brezenski (@bbbrezenski) November 8, 2025
O tornado que devastou o Paraná não é um evento isolado.
É o sinal mais recente de um planeta em desequilíbrio.
Ventos de 250 km/h arrancaram telhados, destruíram casas e mudaram vidas em segundos, no mesmo país que está sediando a COP30, no coração da Amazônia.A natureza está… pic.twitter.com/xI1oDsMhY9
— Kriska Pimentinha (@KriskaCarvalho) November 8, 2025
Also Read..
పిల్లల సోషల్ మీడియా వాడకంపై డెన్మార్క్ నిషేధం