Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది. భూమికి 90 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు తెలిపింది. అయితే, జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (German Research Centre for Geosciences) ప్రకారం.. దీని తీవ్రత 6.07గా నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ భూకంపం ధాటిని ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.
Also Read..
Tornado | టోర్నడో బీభత్సం.. ఆరుగురు మృతి.. 800 మందికి గాయాలు
Ajit Pawar | భూ కుంభకోణం.. డీల్ రద్దు చేయాలంటే రూ.42 కోట్లు చెల్లించాల్సిందే..!
Thar | థార్ నడపడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు : హర్యాణా డీజీపీ