Ajit Pawar | మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ (Ajit Pawar) కుమారుడు పార్థ్పవార్ (Parth Pawar)పై భూ కుంభకోణం ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 1,800 కోట్ల విలువైన మహర్వతన్ భూమిని పార్థ్ పవార్‌కు చెందిన కంపెనీ అమీడియా ఎంటర్‌ప్రైజెస్‌కు రూ. 300 కోట్లకు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ డీల్ కు సంబంధించి రూ.21 కోట్ల స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు కూడా ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై అజిత్ పవార్ నిన్న వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అది ప్రభుత్వ భూమి అని తన కుమారుడికి తెలియదని చెప్పారు. అంతేకాదు, ఆ భూ కేటాయింపును రద్దు చేసినట్లు అజిత్ పవార్ ప్రకటించారు.
అయితే, ఈ డీల్ రద్దు చేయడానికీ పార్థ్ పవార్ కంపెనీ భారీగానే చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దాదాపు స్టాంప్ డ్యూటీకి రెట్టింపు అంటే రూ.42 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు ఈ కేసులో చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఎవరినీ కాపాడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు.
కాగా, దాదాపు రూ. 1,800 కోట్ల విలువైన 40 ఎకరాల మహర్వతన్ భూమిని పార్థ్ పవార్‌కు చెందిన కంపెనీ అమీడియా ఎంటర్‌ప్రైజెస్‌కు రూ. 300 కోట్లకు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అదికూడా కేవలం రూ.500 స్టాంప్ పేపర్‌పై రిజిస్ట్రేషన్ జరిగినట్లు ప్రతిపక్షాలు ఆరోపించారు. ఇది రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ లావాదేవీలో కేవలం లక్ష రూపాయల మూలధనం కలిగిన పార్థ్పవార్ కంపెనీ అమేడియా హోల్డింగ్స్ ఎల్ఎల్పీకి రూ.21 కోట్ల స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. పుణే తహసీల్దార్ సూర్యకాంత్ యెవ్లే, డిప్యూటీ రిజిస్ట్రార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించింది.
Also Read..
Passwords | 2025లో అత్యధికమంది వాడుతున్న కామన్ పాస్వర్డ్స్ ఇవే..
Air Pollution | రెడ్‌జోన్‌లోనే ఢిల్లీ.. ప్రమాదకరంగా గాలి నాణ్యత
Thar | థార్ నడపడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు : హర్యాణా డీజీపీ