Passwords | సైబర్ మోసాలు, హ్యాకింగ్ ముప్పు బారిన పడకుండా ప్రతి ఒక్కరూ బలమైన పాస్వర్డ్లు (Passwords) పెట్టుకోవాలని ఐటీ నిపుణులు, పోలీసులు నిత్యం ప్రజలకు సూచిస్తూనే ఉన్నారు. అయినా యూజర్లలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. సైబర్ సెక్యూరిటీ విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ చాలామంది ఇంటర్నెట్ యూజర్లు పాస్‌వర్డ్‌ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తాజాగా ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఇప్పటికీ ఎక్కువ మంది వినియోగిస్తున్న పాస్‌వర్డ్‌గా ‘123456’ మరోసారి టాప్‌లో నిలిచింది.
ఈ ఏడాదిలో రియల్ డేటా ఉల్లంఘనల నుంచి 2 బిలియన్లకు పైగా లీక్ అయిన పాస్‌వర్డ్‌లను కంపారిటెక్ పోర్టల్ విశ్లేషించింది. ఇందులో ‘123456’, ‘Admin’, ‘Aa123456’, ‘123’, ‘1234567890’ , ‘password’ పాస్‌వర్డ్‌ల జాబితాలో ముందున్నాయి. వీటన్నింటికంటే ‘123456’ పాస్‌వర్డ్‌ను అత్యధిక మంది ఉపయోగించారు. దీన్ని 76 లక్షలకు పైగా ప్రజలు ఉపయోదించారు. ఇక ‘admin’ పాస్‌వర్డ్‌ను 19 లక్షల మందికిపైగా ప్రజలు ఉపయోగించారు. 100 అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌ల జాబితాలో ‘India@123’ 53వ స్థానంలో ఉందని ఈ అధ్యయనంలో తేలింది.
123456
12345678
123456789
admin
1234
Aa123456
12345
password
123
1234567890
Also Read..
Air Pollution | రెడ్‌జోన్‌లోనే ఢిల్లీ.. ప్రమాదకరంగా గాలి నాణ్యత
Bus Driver | బిగ్‌బాస్ షో చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. వీడియో వైరల్
Thar | థార్ నడపడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు : హర్యాణా డీజీపీ