మైలార్దేవ్పల్లి, మార్చి 11: నిబంధనలకు విరుద్ధంగా కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న రెండు కేంద్రాలపై మైలార్దేవ్పల్లి పోలీసులు దాడులు నిర్వహించారు. అల్లీనగర్తో పాటు సుబాన్ కాలనీలో కొనసాగుతున్న ఈ సెంటర్లపై అక్రమంగా నిల్వ చేసిన పదార్థాలను సీజ్ చేశారు. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వివరాల ప్రకా రం.. అల్లీనగర్లో మహ్మద్ జియావుద్దీన్(45) సెవన్ కుక్స్ పేరుతో, సుబాన్ కాలనీ ఫేస్-2లో మహ్మద్ మాజహర్ ఆలీ(47) అర్జున్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఎటువంటి నిబంధనలు, శుభ్రత పాటించకుండా, అపరిశుభ్రమైన వాతావరణంలో పాడైపోయిన వెల్లుల్లి పాయలు తీసుకువచ్చి వాటిలో ప్రమాదకరమైన కెమికల్స్ కలిపి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి లోకల్ షాప్స్, హైదరాబాద్లో ని వివిధ సాప్స్ వారికి అమ్ముతున్నారు.
దీనిపై సమాచా రం అందుకున్న పోలీసులు.. సెవన్ కుక్స్ సాపులో నిండుగా ఉన్న 12 చిన్న డ్రమ్స్లో నాణ్యత లేని అల్లం పేస్ట్, ఐదు కాటన్లలో అరకిలో అల్లంపేస్ట్ డబ్బాలు, ఎటువంటి లేబుల్ లేకుండా ఉన్న ఏడు కుక్స్ పేరు మీద ఉన్న లేబుల్స్-200(మొత్తం 510 కేజీలు) స్వాధీనం చేసుకున్నారు. అలాగే అర్జున్ ఎంటర్ప్రైజెస్ నుంచి నిండుగా ఉన్న నాలుగు చిన్న డ్రమ్స్లో నాణ్యత లేని అల్లం పేస్ట్, ఒక కాటన్లో ఐదు కేజీల డబ్బాలు-5, బ్లాక్ గోల్డ్ స్పైసెస్ పేరు మీద ఉన్న 2కేజీ, అల్లంపేస్ట్కు వాడే ఎక్స్జన్ గమ్ పౌడర్ 1.5 కేజీ(మొత్తం 165 కేజీ) గల వాటిని స్వాధీనం చేసుకున్నారు.