Thaman | ‘లెనిన్’లో ఐటెం సాంగ్ కోసం రష్మికని అనుకున్నారా.. అయితే లేకపోవడానికి కారణం ఇదే..!
Thaman | అక్కినేని అఖిల్ కెరీర్లో ఎంతోకాలం తర్వాత భారీ విజయాన్ని అందించిన చిత్రం 'లెనిన్'. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా, విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. కథ, భావోద్వేగాలు, సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అఖిల్ కెరీర్లో ఈ సినిమా కీలక మైలురాయిగా నిలిచింది.
Thaman | అక్కినేని అఖిల్ కెరీర్లో ఎంతోకాలం తర్వాత భారీ విజయాన్ని అందించిన చిత్రం ‘లెనిన్’. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా, విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. కథ, భావోద్వేగాలు, సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అఖిల్ కెరీర్లో ఈ సినిమా కీలక మైలురాయిగా నిలిచింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని సంగీత దర్శకుడు ఎస్. థమన్ వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ‘లెనిన్’లో మొదట ఓ ప్రత్యేక ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేసినట్లు చెప్పారు. అయితే కథకు అది అవసరం లేదని భావించిన చిత్రబృందం చివరికి ఆ ఆలోచనను పూర్తిగా విరమించుకుందని వెల్లడించారు.
థమన్ మాట్లాడుతూ.. సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశాం. కానీ అది కథనం ప్రవాహానికి సరిపోవడం లేదని మేకర్స్ భావించారు. షూటింగ్ ప్రారంభం కాకముందే ఆ పాటను పూర్తిగా తొలగించాలని నిర్ణయించారు. కథకు అవసరం లేని అంశాన్ని బలవంతంగా జోడిస్తే ప్రేక్షకుల నుంచి అనవసర విమర్శలు వచ్చే అవకాశం ఉందని భావించాం అని తెలిపారు. ఆ పాట చిత్రీకరణకు ముందే ఇంటర్నల్ వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా షేర్ కావడం తనను నిరాశకు గురి చేసిందని థమన్ వెల్లడించారు. ఆ విషయం తెలిసిన తర్వాత తాను తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆ గ్రూపుల నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. సినిమా విడుదలకు ముందే ఇలాంటి విషయాలు బయటకు రావడం సరైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
థమన్ వెల్లడించిన మరో విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్పెషల్ సాంగ్ కోసం మొదట పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. రష్మిక మందన్న, పూజా హెగ్డే, కయాడు లోహర్, ప్రీతి ముఖుందన్ పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, చివరికి ఆ పాటనే పూర్తిగా రద్దు చేయడంతో ఆ ఆలోచన అక్కడితో ముగిసిపోయిందని చెప్పారు. ఈ విషయం తెలిసిన తర్వాత అభిమానులు.. ఒకవేళ ఆ స్పెషల్ సాంగ్ తెరకెక్కి ఉంటే ఎలా ఉండేదో అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా, బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రదర్శన అనంతరం ‘లెనిన్’ త్వరలో ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం వచ్చే వారం నుంచి జీ5లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

