Nara Rohit | నారా రోహిత్ కుమారుడి పేరు ఇదే.. తొలిసారి బాబుతో కలిసి ఫోటో షేర్ చేసిన దంపతులు!
Nara Rohit | టాలీవుడ్ హీరో నారా రోహిత్, సిరి లెల్లా దంపతులు తమ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పారు. ఈ ఏడాది జూన్లో ఈ జంట మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు తమ కుమారుడి ఫొటో, పేరు గురించి పెద్దగా వెల్లడించని ఈ దంపతులు తాజాగా తమ బిడ్డను అభిమానులకు పరిచయం చేశారు.
Nara Rohit | టాలీవుడ్ హీరో నారా రోహిత్, సిరి లెల్లా దంపతులు తమ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పారు. ఈ ఏడాది జూన్లో ఈ జంట మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు తమ కుమారుడి ఫొటో, పేరు గురించి పెద్దగా వెల్లడించని ఈ దంపతులు తాజాగా తమ బిడ్డను అభిమానులకు పరిచయం చేశారు. అంతేకాదు.. తమ కుమారుడికి పెట్టిన పేరును కూడా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నారా రోహిత్, సిరిలెల్లా కలిసి తమ కుమారుడితో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సిరి తన బాబును ఎత్తుకుని ఉండగా.. రోహిత్ పక్కనే చిరునవ్వులు చిందిస్తున్న ఈ ఫొటో ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది. తమ కుమారుడిని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
నారా రోహిత్, సిరిలెల్లా తమ కుమారుడికి ‘నందన్ రామ నారా’ అనే పేరును పెట్టారు. ఈ పేరుకు ప్రత్యేకమైన అర్థం కూడా ఉందని తెలిపారు. ‘నందన్’ అంటే అంతులేని ఆనందాన్ని, సంతోషాన్ని అందించేవాడు అనే అర్థం వస్తుందని వివరించారు. అలాగే ‘రామ’ అనే పేరును తమ కుటుంబంలోని తాతగారి జ్ఞాపకార్థం, ఆయనకు గౌరవ సూచకంగా కుమారుడి పేరులో చేర్చినట్లు వెల్లడించారు. తమ బిడ్డకు పెట్టిన ఈ పేరు కేవలం పేరు మాత్రమే కాదని.. దాని వెనుక కుటుంబ ప్రేమ, అనుబంధం, ఎంతో విలువైన జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కుమారుడు పుట్టిన తర్వాత తొలిసారి బాబుతో కలిసి నారా రోహిత్, సిరిలెల్లా ఫొటోను పంచుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నారా రోహిత్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా, నారా రోహిత్, సిరిలెల్లా వివాహం అనంతరం ఈ ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఇప్పుడు తమ కుమారుడి పేరును, ఫొటోను అభిమానులతో పంచుకోవడంతో వారి ఆనందం మరింత రెట్టింపైంది. కుటుంబ సభ్యుల జ్ఞాపకాలను ముడిపెడుతూ కుమారుడికి పెట్టిన ‘నందన్ రామ నారా’ పేరు ప్రత్యేకంగా నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

