ACB Raids | నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ నివాసంపై ఏసీబీ సోదాలు.. మూడు జిల్లాల్లో 12 చోట్ల తనిఖీలు
ACB Raids | నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ సోదాలు చేపట్టింది. మూడు జిల్లాల్లో 12 ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
ACB Raids | నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్‌పై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై మంగళవారం ఉదయం ఏకకాలంలో ఈ తనిఖీలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌తో పాటు మూడు జిల్లాల్లో మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు సోదాలు చేపట్టాయి.
లక్ష్మీభాస్కర్‌కు సంబంధించిన నివాసాలు, కార్యాలయాలు, ఇతర అనుబంధ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎర్రగడ్డలోని ఆయనకు చెందిన కల్పతరువు అపార్ట్‌మెంట్స్‌తో పాటు కుటుంబసభ్యులకు సంబంధించిన ప్రాంతాల్లోనూ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, డిపాజిట్లు తదితర వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోదాలు పూర్తయిన అనంతరం స్వాధీనం చేసుకున్న నగదు, పత్రాలు, ఇతర ఆస్తులకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

