న్యూఢిల్లీ: పార్లమెంట్(Parliament)లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. లోక్సభలో ఇవాళ కూడా విపక్ష సభ్యులు ఆందోలన చేపట్టారు. సీజేపీ కార్యకర్తులు, విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ అంశంలో.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని కోరుతూ విపక్షాలు డిమాండ్ చేశాయి. సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు. కానీ విపక్ష సభ్యులు షా స్టేట్మెంట్ కోసం పట్టుపట్టారు. విపక్ష సభ్యులు ఎంతకీ తగ్గకపోవడంతో.. స్పీకర్ బిర్లా సభను 12 గంటలకు వాయిదా వేశారు. అయితే యాంటీ పేపర్ లీకేజీ బిల్లుపై మంగళవారం చర్చ ప్రారంభమైన విషయం తెలిసిందే.
మరో వైపు రాజ్యసభలో కూడా విపక్ష సభ్యులు ఆందోలన చేపట్టారు. మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ విద్యార్థులను కొట్టిన వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. ప్రజలు సురక్షితంగా లేదని, ప్రజాస్వామ్యం కూడా సురక్షితంగా లేదని ఖర్గే అన్నారు. బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలకు జేపీ నడ్డా కౌంటర్ ఇచ్చారు. శాంతి, భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు సహజంగా చర్యలు తీసుకున్నారని జేపీ నడ్డా అన్నారు. రాజ్యసభను కూడా 12 గంటల వరకు వాయిదా వేశారు.