H-1B Visa | హెచ్-1 బీ మోసాలపై ఉక్కుపాదం.. దర్యాప్తు ముమ్మరం చేసిన ట్రంప్ సర్కార్
H-1B Visa | హెచ్-1 బీ వీసా కార్యక్రమంలో మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నది. విదేశీ కార్మికుల వీసాల్లో మోసం, ఉద్యోగుల దోపిడీ, మానవ అక్రమ రవాణా ఆరోపణలపై అమెరికా కార్మిక శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది.
H-1B Visa | వాషింగ్టన్: హెచ్-1 బీ వీసా కార్యక్రమంలో మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నది. విదేశీ కార్మికుల వీసాల్లో మోసం, ఉద్యోగుల దోపిడీ, మానవ అక్రమ రవాణా ఆరోపణలపై అమెరికా కార్మిక శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో హెచ్-1బీ వీసా కార్యక్రమం ఏడాది తర్వాత ప్రస్త్తుత రూపంలో ఉండకపోవచ్చని అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పొసిటో హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతమిస్తూ ‘మా దగ్గర చేతులకు బేడీలు సిద్ధంగా ఉన్నాయి’ అని ఆయన అన్నారు. అమెరికన్ యూట్యూబర్ బెన్నీ జాన్సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డి ఎస్పొసిటో ఈ వ్యాఖ్యలు చేశారు.
‘విదేశీ కార్మికుల వీసా కార్యక్రమం 365 రోజలు తర్వాత ప్రస్తుతం ఉన్నదాని కంటే చాలా భిన్నంగా ఉండబోతోంది’ అని అన్నారు. హెచ్-1 బీ వీసా కార్యక్రమంలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్న మోసాలు, ఉద్యోగుల దోపిడీ, మానవ అక్రమ రవాణాపై అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం దేశవ్యాప్తంగా దర్యాప్తు కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజ సంస్థలు కాగ్నిజంట్, క్లౌడెరాకు సంబంధించిన వీసా దరఖాస్తులను నేర దర్యాప్తు పూర్తయ్యే వరకు నిలిపివేసినట్లు కూడా తెలిపింది. విదేశీ కార్మికుల కార్యక్రమాలను దుర్వినియోగం చేశారనే అనుమానాలున్న సంస్థలు, విధానాలపై దర్యాప్తు కొనసాగుతున్నదని డి ఎస్పోసిటో తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

