Samsung Mobiles | బాదుడు షురూ… సామ్సంగ్ మొబైల్స్ ప్రియం
Samsung Mobiles | సామ్సంగ్.. దేశీయ వినియోగదారులకు షాకిచ్చింది. గెలాక్సీ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఎస్26 సిరీస్ మాడళ్ల ధరలను 17 శాతం వరకు పెంచింది.
Samsung Mobiles | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28 : సామ్సంగ్.. దేశీయ వినియోగదారులకు షాకిచ్చింది. గెలాక్సీ సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన ఎస్26 సిరీస్ మాడళ్ల ధరలను 17 శాతం వరకు పెంచింది. దీంతో గెలాక్సీ ఎస్26 సిరీస్ బేసిక్ మాడల్ 256 జీబీ సామర్థ్యం కలిగిన మొబైల్ ధర రూ.1,02,999కి చేరుకున్నది. మొదట్లో ధర రూ.87,999గానే ఉన్నది. ఎస్26 అల్ట్రా ధర కూడా రూ.1,39,999 నుంచి రూ.1,54,999కి సవరించింది. అల్ట్రా 512 జీబీ స్టోరేజ్ మాడల్ ధర 9.4 శాతం పెరుగడంతో విలువ రూ.1,74,999కి చేరుకున్నది. మెమొరీ చిప్‌లు, మదర్‌బోర్డు, ఇతరత్రా ధరలు పెరుగడం వల్లనే ధరల పెంపు అని తెలుస్తున్నది.
ఎల్జీ ఏసీలు ప్రియం
ఎయిర్ కండీషనర్ల ధరలను 5 శాతం నుంచి 7 శాతం వరకు పెంచుతున్నట్టు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా తాజాగా ప్రకటించింది. పెరిగిన ధరలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే రాబోయే పండుగ సీజన్ నేపథ్యంలో ఈ నిర్ణయం విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయ పడుతున్నారు. అయితే ముడి సరుకుల ధరలు, రవాణా, ఇంధన వ్యయాలు పెరుగడంతోపాటు విదేశీ మారకం రేట్లలో మార్పుల కారణంగా ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కాగా, టీవీ, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్, ఇతర ఉత్పత్తుల ధరలపై ఎలాంటి పెంపూ లేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

