Thar | మార్కెట్లో ఎన్ని ఖరీదైన కార్లు ఉన్నా.. మహీంద్రా సంస్థకు చెందిన థార్ (Thar) వాహనాన్నే నేటితరం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వాహనాన్ని నడిపే వ్యక్తులను ఉద్దేశించి హర్యాణా డీజీపీ (Haryana DGP) ఓపీ సింగ్ (OP Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు థార్ నడపడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.
శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తనిఖీల సమయంలో పోలీసులు అనుసరించే విధానాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు అన్ని వాహనాలనూ తనిఖీ చేయరని చెప్పారు. థార్, బుల్లెట్ వాహనాలను మాత్రం వదిలిపెట్టమని పేర్కొన్నారు. వాహనం ఎంపిక వారి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. థార్‌తో విన్యాసాలు చేస్తున్నారని.. అదో స్టేటస్ సింబల్‌గా మారిందంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Mukesh Ambani | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖేశ్ అంబానీ
Kolkata | కోల్‌కతాలో దారుణం.. నానమ్మ వద్ద నిద్రిస్తున్న నాలుగేండ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగికదాడి
ఆటోమెటిక్ రిజెక్షన్.. అమెరికాలో భారతీయ ఉద్యోగార్థుల పరిస్థితి అగమ్యగోచరం!