Bus Driver | దేశంలో ఇటీవలే బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తోన్న విషయం తెలిసిందే. ఏపీ కర్నూలు, తెలంగాణ చేవెళ్లలో జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ డ్రైవర్ (Bus Driver) రాత్రిపూట తన ఫోన్లో బిగ్‌బాస్ (Bigg Boss) షో చూస్తూ బస్సును హైస్పీడ్‌తో నడుపుతున్న వీడియో నెట్టింట చర్చకు దారితీసింది.
ఆ వీడియో ప్రకారం.. బస్సు ముంబై నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో బస్సు డ్రైవర్ స్టీరింగ్ వద్ద ఫోన్ పెట్టుకుని బిగ్‌బాష్ షో చూస్తూ కనిపించాడు. ఆ సమయంలో బస్సు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. బస్సులోని ఓ ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలోపోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా బస్సు నడుపుతున్న డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అక్టోబర్ 27న జరిగినట్లు తెలుస్తోంది.
Big Boss is injurious to life & family😱pic.twitter.com/HzpHJE782N
— Vije (@vijeshetty) November 8, 2025
Also Read..
Thar | థార్ నడపడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు : హర్యాణా డీజీపీ
Mukesh Ambani | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖేశ్ అంబానీ
Kolkata | కోల్‌కతాలో దారుణం.. నానమ్మ వద్ద నిద్రిస్తున్న నాలుగేండ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగికదాడి