వరంగల్ : జే.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ప్యాకేజ్–5 LMC DC–3 కెనాల్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరుతూ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నర్సింగాపురం గ్రామంలో ఎర్రకుంట చెరువు సమీపంలోని కెనాల్ వద్ద రైతులు మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీళ్ల లేక కండ్లముందే పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నిర్మాణ పనులు పూర్తి చేసి నీళ్లు విడుదుల చేసి రైతులను ఆదుకోవాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలి : సట్ల వెంకటరమణగౌడ్