స్టేషన్ ఘనాపూర్ సెప్టెంబర్ 09 : విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్ మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని జనగామ జిల్లా బీజేపీ స్టేషన్ ఘనాపూర్ మండల అధ్యక్షుడు సట్ల వెంకటరమణగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఎలక్షన్ డీటీ సదానందంకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం ఆలస్యం కావడంతో ఉన్నత విద్య కొనసాగించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను చెల్లించాలని కోరారు. లేనిపక్షంలో మండల కేంద్రంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రడపాక ప్రదీప్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కందిమల్ల కృష్ణమూర్తి, అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్ తౌటి రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మండల ఎస్ఐఆర్ కన్వీనర్ సట్ల రాజకుమార్, మండల ఉపాధ్యక్షుడు బుర్ల అనిల్, సీనియర్ నాయకుడు మహేశ్వరం రమేష్‌చారి, జిల్లా నాయకులు భాస్కుల నరసయ్య, వైట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.