– నల్లగొండ కలెక్టర్‌కు అన్ని మండలాల సర్పంచుల వినతి
మాల్. సెప్టెంబర్ 09 ; గ్రామ పంచాయతీలలో ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ రద్దు చేయాలని కోరుతూ నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌కు జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఉప సర్పంచులకు జాయింట్ పవర్ ఇవ్వడంతో గ్రామాలలో నెలకొన్న పారిశుధ్య పనులు చేపట్టలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని గ్రామ పంచాయతీలలో మహిళలు సర్పంచులుగా ఉన్నందున వారికి తెలువకుండానే చెక్కులు డ్రా చేస్తున్నారని తెలిపారు. ప్రజలచే ఎన్నుకోబడిన సర్పంచులకే చెక్ పవర్ ఉండేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం నాయకులు జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.