Harish Rao | గాల్లో దీపంలాగా ఈహెచ్ఎస్ అమలు.. ఉద్యోగులకు మాత్రం జీతంలో కోత : హరీశ్ రావు
Harish Rao | ఇప్పటికి జీతంలో 4 నెలలు కోత పెట్టిర్రు. కానీ ఈ 4 నెలల్లో పాత ఈహెచ్ఎస్ బంద్ అయింది.. కొత్త ఈహెచ్ఎస్ అమలులోకి రాలేదన్నారు. ఈహెచ్ఎస్ అమలు గాల్లో దీపం లాగా అయిపోయిందన్నారు హరీశ్ రావు.
Harish Rao | ప్రభుత్వం మాటలు చెప్పింది తప్ప.. ఈ రాష్ట్రంలో ఈహెచ్ఎస్ అమలు కావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. గురువారం హన్మకొండ కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మొన్న మా దగ్గర ఖాజా మెయినోద్దీన్.. రిటైర్డ్ హెడ్మాస్టర్. వాళ్ల తండ్రికి హార్ట్ ఎటాక్ వస్తే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఏ ఆస్పత్రికి పోయినా ఈహెచ్ఎస్ లేదుపో అంటున్నరట. చివరగా ఒక ఆస్పత్రిలో జాయిన్ చేశారు. రూ.11 లక్షలు బిల్ అయింది.. ఈహెచ్ఎస్ వర్తించదు.. డబ్బు కట్టాల్సిందే అంటే నేను ఆస్పత్రికి వెళ్లి బతిమిలాడితే రూ.2-3 లక్షలు తగ్గించాల్సిన పరిస్థితి. అంటే ప్రభుత్వం మాటలు చెప్పింది తప్ప.. ఈ రాష్ట్రంలో ఈహెచ్ఎస్ అమలు కావడం లేదన్నారు.
నేను నెట్ వర్క్ ఆస్పత్రులతో మాట్లాడిన. రెండు యూనియన్లున్నాయి. 11 కార్పోరేట్ ఆస్పత్రులు ఒక యూనియన్. రాష్ట్రవ్యాప్తంగా ఉండే ప్రైవేట్ ఆస్పత్రులది ఒక యూనియన్ అని హరీశ్ రావు పేర్కొన్నారు. ఏమైంది మీ ఈహెచ్ఎస్ ఎందుకు అమలు చేయడం లేదంటే మేం ప్రభుత్వంతో అగ్రిమెంట్ కాలేదు. మాకు ఆరోగ్యశ్రీ బకాయిలే పెండింగ్‌లో ఉన్నాయి. మాకు ఇచ్చిన ప్యాకేజీ గిట్టుబాటు కాదు.. మేము ఈహెచ్ఎస్ అమలు చేయడానికి సిద్దంగా లేమని ఈ రోజులు ప్రైవేట్ ఆస్పత్రుల వాళ్లు చెబుతున్నారు. అంటే ప్రభుత్వం ఆస్పత్రులతో అగ్రిమెంట్ కాలేదు. ప్యాకేజీలు డిసైడ్ కాలేదు. కానీ ఉద్యోగులకు మాత్రం జీతంలో 1.5 శాతం కట్ చేసుకుంటూ పోతున్నరు. ఇప్పటికి 4 నెలలు కోత పెట్టిర్రు. కానీ ఈ 4 నెలల్లో పాత ఈహెచ్ఎస్ బంద్ అయింది.. కొత్త ఈహెచ్ఎస్ అమలులోకి రాలేదన్నారు. ఈహెచ్ఎస్ అమలు గాల్లో దీపం లాగా అయిపోయిందన్నారు హరీశ్ రావు.
LIVE: హన్మకొండ కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish https://t.co/hyGn70yEay
— BRS Party (@BRSparty) August 27, 2026
Read Also :
Donald Trump | ఆయన బతికే ఉన్నా తీవ్ర గాయాలతో ఉన్నారు : డొనాల్డ్ ట్రంప్
Shoaib Akhtar | క్రికెట్ కోసం బాలీవుడ్ చాన్స్ వదులుకున్నా : షోయబ్ అక్తర్
Akhilesh Yadav | అంకిత్ బలియాన్ హత్య జాట్ సామాజిక వర్గంపై జరిగిన దాడి: అఖిలేష్ యాదవ్
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

