Shoaib Akhtar | పాకిస్తాన్ మాజీ పేస్ దిగ్గజం షోయబ్ అక్తర్ తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఒకానొక సమయంలో తనకు బాలీవుడ్ సినిమాలలో నటించేందుకు చాలా ఆఫర్లు వచ్చాయని తెలిపాడు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటించిన ‘గ్యాంగ్ స్టర్’ చిత్రంతో పాటు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నుండి కూడా తనకు సినిమా ఆఫర్లు వచ్చాయని షోయబ్ గుర్తుచేసుకున్నారు. భారత్-పాకిస్తాన్ సంబంధాలు సానుకూలంగా ఉన్న కాలంలో తాను నటన వైపు అడుగులు వేయాలని ఆలోచించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే క్రికెట్, సినిమా రంగాలు రెండూ ఒకే సమయంలో సాధ్యం కాదని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నట్లు షోయబ్ చెప్పుకోచ్చాడు.
తన ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ చూసి చాలా మంది దర్శకులు తనను విలన్ పాత్రలకు సరిగ్గా సరిపోతానని భావించారని.. సల్మాన్ ఖాన్ కూడా స్వయంగా తనకు ఒక సినిమాలో నటించే అవకాశం ఇచ్చారని షోయబ్ గుర్తుచేసుకున్నాడు. అయితే తన శరీరాకృతి సల్మాన్ ఖాన్ లాగే ఉంటుందని, కానీ ఆయన లాంటి మంచి మనసు తనకు లేదని, ఆయన ఎంతో మందికి సహాయం చేస్తారని షోయబ్ కొనియాడారు.