మహబూబాబాద్ : నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందిన పలువురు పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజురైన 1,72,500 రూపాయల విలువగల చెక్కులను సత్యవతి రాథోడ్ మహబూబాబాద్‌లోని వారి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యులు మహబూబ్ పాషా, కురవి మాజీ ఎంపీపీ పద్మ, మన్యు ప్యాట్నీ, బోడ శ్రీను నాయక్, రమేష్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Heart Attack | షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన 25 ఏండ్ల యువకుడు.. వీడియో