హైదరాబాద్: హైదరాబాద్ నాగోల్లో (Nagole) విషాదం చోటుచేసుకున్నది. షటిల్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో (Heart Attack) 25 ఏండ్ల యువకుడు మృతించెదాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు రాకేశ్ (25) నాగోల్లో ఉంటున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో నాగోల్లోని ఓ స్టేడియంలో షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటివారు సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించారు. అయినా లాభం లేకపోవడంతో దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యుతు నిర్ధారించారు.
షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి 25 ఏళ్ల యువకుడు మృతి
నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిన రాకేష్
ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు నిర్ధారించిన వైద్యులు
మృతుడు ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు గుండ్ల… pic.twitter.com/v3rVaXM3gt
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2025