కమలాపూర్ : మండలంలోని ఉప్పల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని కన్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని రాములపల్లి చెందిన వంటకాల రామ్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, రామ్ రెడ్డి ద్విచక్ర వాహనంపై ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తుండగా ఆర్టీసీ బస్సు రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టింది. దీంతో రామ్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న సీఐ హరికృష్ణ, ఎస్ఐ వీరభద్రరావు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Jwala Gutta | పెళ్లిరోజునే పండంటి పాపకు జన్మనిచ్చిన స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి