Jwala Gutta | పెళ్లిరోజునే పండంటి పాపకు జన్మనిచ్చిన స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
Jwala Gutta | స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ (badminton player) గుత్తాజ్వాల (Jwala Gutta), తమిళ నటుడు విష్ణు విశాల్ (Vishnu Vishal) తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
Jwala Gutta | స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ (badminton player) గుత్తాజ్వాల (Jwala Gutta), తమిళ నటుడు విష్ణు విశాల్ (Vishnu Vishal) తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాము తల్లిదండ్రులైనట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. గుత్తా జ్వాలా పండంటి ఆడబిడ్డకు (baby girl) జన్మనిచ్చినట్లు విష్ణు విశాల్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఇవాళ తమ 4వ వివాహ వార్షికోత్సవం అని తెలిపారు. ఇదే రోజు తమకు ఆ దేవుడు గిఫ్ట్‌గా పాపను ఇచ్చాడని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
‘మాకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. ఈ రోజు మా 4వ వివాహ వార్షికోత్సవం. అదే రోజున మేము ఆ భగవంతుడి నుంచి ఈ బహుమతిని అందుకోవడం సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ, క్రీడా ప్రముఖులు గుత్తా జ్వాలా- విష్ణు విశాల్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
We are blessed with a BABY GIRL..
Aryan is an elder brother now…Its our 4th wedding anniversary today…
On the same day we welcome this gift from the Almighty…😍Need all your love and blessings….😍😍@Guttajwala 😍😍 pic.twitter.com/vSAPVMXKN8
— VISHNU VISHAL – VV (@TheVishnuVishal) April 22, 2025
2005లో చేతన్ ఆనంద్ ని ప్రేమించి పెళ్లాడిన గుత్తాజ్వాల 2011లో విడిపోయారు. అప్పటినుంచి కెరీర్ పైనే దృష్టిపెట్టిన గుత్తా ఆ తర్వాత తమిళ హీరో విష్ణువిశాల్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత పెద్ద అంగీకారంతో 2021 ఏప్రిల్ 22న వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక కాస్ట్యూమ్ డిజైనర్ రజనీ నటరాజ్‌తో 2011లో విష్ణు విశాల్ పెళ్లి జరిగింది. కొన్ని కారణాల వల్ల 2018లో వీరు విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఓ కుమారుడు ఆర్యన్ ఉన్నాడు. ప్రస్తుతం ఆర్యన్ విష్ణు విశాల్ దగ్గరే పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Zeeshan Siddique | మీ నాన్నను చంపినట్లే నిన్ను కూడా.. బాబా సిద్ధిఖీ కుమారుడికి హత్య బెదిరింపులు
JD Vance | జైపూర్ అంబర్ ఫోర్ట్‌ను సందర్శించిన జేడీ వాన్స్ ఫ్యామిలీ
Arsenic | బియ్యంలో ఆర్సెనిక్.. ప్రపంచంలో 20 శాతం మందికి క్యాన్సర్ ముప్పు!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

