JD Vance | అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. తొలిరోజు ఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించారు. సాయంత్రం ప్రధాని మోదీతో జేడీ వాన్స్ దంపతులు భేటీ అయ్యారు. ఇక రెండోరోజైన ఇవాళ జేడీ వాన్స్ తన భార్య ఉషా వాన్స్ (Usha Vance), ముగ్గురు పిల్లలతో కలిసి జైపూర్ (Jaipur) సందర్శనకు వెళ్లారు. అక్కడ అంబర్ ఫోర్ట్ (Amber Fort)ను సందర్శించారు. ఆ కోట విశేషాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
#WATCH | Rajasthan: Vice President of the United States, JD Vance, along with Second Lady Usha Vance and their children welcomed at Jaipur’s Amber Fort. pic.twitter.com/bhFxFOLrHW
— ANI (@ANI) April 22, 2025
ఈనెల 24వ తేదీ వరకూ జేడీ వాన్స్, ఉషా వాన్స్ దంపతులు భారత్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నిన్న ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో జేడీ వాన్స్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై విస్తృత చర్చలు జరిపారు. చర్చల అనంతరం ప్రధాని మోదీ వాన్స్ దంపతులకు విందు ఇచ్చారు. కాగా వాన్స్ దంపతుల ముగ్గురు పిల్లలు భారతీయ సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. ఇక ఈ పర్యటనలో ఉపాధ్యక్షుడి ఫ్యామిలీ ఆగ్రాను కూడా సందర్శించనుంది.
#WATCH | Rajasthan: Vice President of the United States, JD Vance, along with Second Lady Usha Vance and their children at Jaipur’s Amber Fort. pic.twitter.com/COCRhmzizo
— ANI (@ANI) April 22, 2025
#WATCH | Rajasthan: Vice President of the United States, JD Vance, along with Second Lady Usha Vance and their children at Jaipur’s Amber Fort. pic.twitter.com/vhE2iPh61Z
— ANI (@ANI) April 22, 2025
#WATCH | Rajasthan: Vice President of the United States, JD Vance, along with Second Lady Usha Vance and their children at Jaipur’s Amber Fort. pic.twitter.com/1bdZtGzYgD
— ANI (@ANI) April 22, 2025
Also Read..
“JD Vance | భారత్కు చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఇవాళ ప్రధాని మోదీతో భేటీ”
“JD Vance | భారతీయ సంప్రదాయ దుస్తుల్లో జేడీ వాన్స్ పిల్లలు.. వీడియో వైరల్”