న్యూఢిల్లీ : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్‌తో ప్రధాని నరేంద్రమోదీ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై విస్తృత చర్చలు జరిపారు. చర్చల అనంతరం ప్రధాని మోదీ వాన్స్ దంపతులకు విందు ఇచ్చారు. కాగా వాన్స్ దంపతుల ముగ్గురు పిల్లలు భారతీయ సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు.
వ్యవసాయం, పాడిపరిశ్రమ, చేపలు పట్టడంలో అమెరికాతో భారత్ అసంబద్ధ ఒప్పందాలు చేసుకుంటే దేశవ్యాప్తంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. జేడీ వాన్స్ భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా సోమవారం హైదరాబాద్ సుందరయ్య పార్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.