JD Vance | అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) తన ఫ్యామిలీతో కలిసి భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. భార్య ఉషా వాన్స్ (Usha Vance), ముగ్గురు పిల్లలతో కలిసి సోమవారం ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఎయిర్పోర్ట్లో వాన్స్ ఫ్యామిలీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జేడా వాన్స్ పిల్లలు భారతీయ సంప్రదాయ దుస్తుల్లో (desi outfits) కనిపించి అందరినీ ఆకర్షించారు.
#WATCH | Delhi: Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children, at Palam airport.
Vice President JD Vance is on his first official visit to India and will meet PM Modi later today. pic.twitter.com/LBDQES2mz1
— ANI (@ANI) April 21, 2025
జేడీ వాన్స్, ఉషా దంపతులకు ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్ ఉన్న విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు అబ్బాయిలు కాగా, ఒక అమ్మాయి. ఇవాళ భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ముగ్గురు పిల్లలు సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. కుమారులు ఇద్దరు కుర్తా, పైజామా ధరించగా.. కుమార్తె అనార్కలీ స్టైల్లో ఫుల్ లెంగ్త్ డ్రెస్సు ధరించి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇక భారత్లో ల్యాండ్ అయిన వెంటనే వీరు ఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించారు.
दिल्ली : अमेरिका के उपराष्ट्रपति JDVance, द्वितीय महिला उषा वेंस अपने बच्चों के साथ अक्षरधाम मंदिर पहुंचे #JDVance | JD Vance | #UShaVance pic.twitter.com/q4jfvRuW7K
— SACH TALKS (@SachTalks) April 21, 2025
జేడీ వాన్స్ ఫ్యామిలీ నాలుగు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా జేడీ వాన్స్ ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో భేటీ కానున్నారు. భారత్ – అమెరికా సంబంధాలను (India-US ties) బలోపేతం చేసే మార్గాలపై ఇరువురూ చర్చించనున్నారు. అనంతరం రాజస్థాన్ జైపూర్, ఆగ్రాను సందర్శించనున్నారు. 24వ తేదీన తమ పర్యటనను ముగించుకుని వాషింగ్టన్ డీసీకి బయల్దేరి వెళ్తారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్న క్రమంలో ఉపాధ్యక్షుడి భారత పర్యటన ఆసక్తికరంగా మారింది. ఇక ఉషా వాన్స్ సెకండ్ లేడీ హోదాలో తొలిసారి భారత్కు వచ్చారు. ఆమె తల్లిదండ్రులు క్రిష్ చిలుకూరి, లక్ష్మీ చిలుకూరి 1970 చివరలో భారత్ నుంచి అమెరికాకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఉషా వాన్స్ అక్కడే జన్మించారు.
Also Read..
JD Vance | భారత్కు చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఇవాళ ప్రధాని మోదీతో భేటీ
Rs.500 Notes | పెద్ద ఎత్తున చెలామణీలోకి ఫేక్ రూ.500 నోట్లు.. ఎలా గుర్తించాలంటే..?
Rahul Gandhi | భారత్లో ఎన్నికల సంఘం రాజీ పడింది : రాహుల్ గాంధీ