Rahul Gandhi | కేంద్ర ఎన్నికల సంఘంపై (Election Commission in India) కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఎన్నికల సంఘం రాజీ పడిందని ఆరోపించారు. అంతేకాదు, ఆ వ్యవస్థలో చాలా లోపాలున్నాయన్నారు. ఇందుకు ఇటీవలే జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను (Maharashtra assembly elections) ఉదాహరణగా చెప్పారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ బోస్టన్ (Boston)లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఈసీపై ఈ వ్యాఖ్యలు చేశారు.
‘భారతదేశంలో ఎన్నికల సంఘం రాజీ పడింది. ఆ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని మాకు స్పష్టంగా తెలుసు. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇటీవలే మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల మధ్య 65 లక్షల మంది ఓటు వేసినట్లు ఎన్నికల సంఘమే స్వయంగా ప్రకటించింది. అంత తక్కువ సమయంలో అంతమంది ఎలా ఓటు వేస్తారు. ఇది భౌతికంగా అసాధ్యం. అక్కడ ఏదో తప్పు జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో మేము వీడియోలు చూపించాలని అడిగాం. అందుకు ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగడానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు’ అని రాహుల్ ఆరోపించారు.
Boston, US: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says “It is very clear to us that the Election Commission is compromised, and it is very clear that there is something wrong with the system. I have said this multiple times…More people voted in the Maharashtra Assembly… pic.twitter.com/tUa7i2S2XN
— ANI (@ANI) April 21, 2025
కాగా, రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ అమెరికా వెళ్లారు. ఇవాళ, రేపు యూఎస్‌లో పర్యటించనున్నారు. తన పర్యటనలో రాహుల్ రోడ్ ఐలాండ్ (Rhode Island) లోని బ్రౌన్ యూనివర్సిటీని (Brown University) సందర్శిస్తారు. అక్కడ విద్యార్థులు, అధ్యాపకులతో చర్చలో పాల్గొంటారు. అంతేకాదు ఎన్నారై సంఘాలు, ఇండియా ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులతో రాహుల్ సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇటీవలే ప్రకటించింది.
ఇక అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడల్లా రాహుల్ ఏదోఒక వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతంలో రాహుల్ గాంధీ విదేశాల్లో పర్యటించిన సమయంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గత పర్యటనల్లో రాహుల్.. భారత్‌లో మత స్వేచ్ఛ, రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.
Also Read..
JD Vance | భారత్‌కు చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఇవాళ ప్రధాని మోదీతో భేటీ
China | అమెరికాతో ట్రేడ్ డీల్.. ఆ దేశాలకు చైనా సీరియస్ వార్నింగ్