China | అమెరికాతో ట్రేడ్ డీల్.. ఆ దేశాలకు చైనా సీరియస్ వార్నింగ్
China | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే.దీంతో పలు దేశాలు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నాయి (Trade Deals).
China | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న భారత్ సహా అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు. అయితే, వాణిజ్య చర్చల కోసం వాటిని 90 రోజుల పాటు నిలిపివేస్తూ నిర్ణయం ప్రకటించారు. చైనా (China)కు మాత్రం ఎలాంటి మినహాయింపులూ ఇవ్వలేదు. దీంతో ప్రభావిత దేశాలు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నాయి (Trade Deals). ఈ సుంకాల నుంచి మినహాయింపులు పొందాలంటే చైనాతో ఉన్న ఆర్థిక సంబంధాలను విరమించాల్సిందిగా ట్రంప్ సర్కార్ కొన్ని మిత్రదేశాలకు స్పష్టంగా సూచించినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ వార్తలపై చైనా తీవ్రంగా స్పందించింది. తమ దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది.
‘అమెరికాతో ఒప్పందాలు చేసుకునే సందర్భంలో వాటి ప్రభావం చైనా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయగలదనుకుంటే అలాంటి ఒప్పందాలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అలాంటి పరిస్థితి ఎదురైతే దాన్ని మేం ఎప్పటికీ అంగీకరించం. మా నుంచి వచ్చే ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో ఉంటుంది. బుజ్జగింపులతో శాంతి స్థాపన జరగదు. రాజీ పడితే గౌరవం లభించదు. తక్షణ లాభాల కోసం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో తీవ్రమైన నష్టాలను కలిగించే అవకాశం ఉందన్న విషయాన్ని దేశాలు గుర్తించుకోవాలి’ అని పేర్కొంది. ఈ మేరకు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చైనా ఉత్పత్తులపై అమెరికా టారిఫ్లు 245 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే.
Also Read..
JD Vance | భారత్కు చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. ఇవాళ ప్రధాని మోదీతో భేటీ
Nepal | రాచరికం మళ్లీ రావాలి.. నేపాల్లో భారీ నిరసనలు
F-1 Visa | ఎఫ్-1 వీసాల రద్దుపై న్యాయ పోరాటం.. ట్రంప్ ప్రభుత్వంపై భారత్, చైనా విద్యార్థుల దావా
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

