F-1 Visa | ఎఫ్-1 వీసాల రద్దుపై న్యాయ పోరాటం.. ట్రంప్ ప్రభుత్వంపై భారత్, చైనా విద్యార్థుల దావా
ఎఫ్-1 స్టూడెంట్ వీసాలను చిన్న చిన్న కారణాలను చూపుతూ అమెరికా ప్రభుత్వం రద్దు చేయడాన్ని ముగ్గురు భారతీయ విద్యార్థులు, ఇద్దరు చైనా విద్యార్థులు సవాల్ చేశారు. వీరు న్యూ హాంప్‌షైర్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. తమ ఎఫ్-1 స్టేటస్‌ను ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా రద్దు చేయడం వల్ల చట్టబద్ధమైన స్టూడెంట్ స్టేటస్‌కు తాము దూరమయ్యామని వాదించారు.
- నిర్బంధం, వెళ్లగొట్టడం ఆపాలని విన్నపం
F-1 Visa | వాషింగ్టన్ : ఎఫ్-1 స్టూడెంట్ వీసాలను చిన్న చిన్న కారణాలను చూపుతూ అమెరికా ప్రభుత్వం రద్దు చేయడాన్ని ముగ్గురు భారతీయ విద్యార్థులు, ఇద్దరు చైనా విద్యార్థులు సవాల్ చేశారు. వీరు న్యూ హాంప్‌షైర్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. తమ ఎఫ్-1 స్టేటస్‌ను ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా రద్దు చేయడం వల్ల చట్టబద్ధమైన స్టూడెంట్ స్టేటస్‌కు తాము దూరమయ్యామని వాదించారు. తమ వీసాలను పునరుద్ధరించాలని, తమను నిర్బంధించడాన్ని, అమెరికా నుంచి పంపించేయడాన్ని ఆపాలని కోరారు.
వందలాది మం ది విదేశీ విద్యార్థుల ఎఫ్-1 వీసాలను డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ ఏకపక్షంగా రద్దు చేసిందని తెలిపారు. అదేవిధంగా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పార్టిసిపెంట్స్ ఎఫ్-1 వీసాలను కూడా రద్దు చేసిందన్నారు. భారతీయ విద్యార్థులు మణికంఠ పసుల, లింఖిత్ బాబు గొర్రెల, తనూజ్ కుమార్ గుమ్మడవెల్లి, చైనా విద్యార్థులు హాంగ్రుయి ఝాంగ్, హాయాంగ్ ఆన్ ఈ దావాను దాఖలు చేశారు. లింఖిత్ బాబు గ్రాడ్యుయేషన్ వచ్చే నెలలో పూర్తవుతుంది. గుమ్మడవెల్లి, పసుల మాస్టర్స్ డిగ్రీ పూర్తి కావడానికి ఒక సెమిస్టర్ మిగిలి ఉంది. కోర్టు జోక్యం చేసుకోకపోతే వీరి ఆశలు అడియాశలు అవుతాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

