JD Vance | అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) భారత్కు చేరుకున్నారు. భార్య ఉషా వాన్స్ (Usha Vance), పిల్లలతో కలిసి ఇవాళ ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం లభించింది. వారు నాలుగు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా జేడీ వాన్స్ ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో భేటీ కానున్నారు. భారత్ – అమెరికా సంబంధాలను (India-US ties) బలోపేతం చేసే మార్గాలపై ఇరువురూ చర్చించనున్నారు.
#WATCH | Delhi: Vice President of the United States, JD Vance, along with Second Lady Usha Vance arrive at Palam airport.
Union Minister Ashwini Vaishnaw received the Vice President. pic.twitter.com/pN4NZlYfNn
— ANI (@ANI) April 21, 2025
ఈ పర్యటనలో జేడా వాన్స్ ఫ్యామిలీ రాజస్థాన్ జైపూర్, ఆగ్రాను సందర్శించనున్నారు. 24వ తేదీన తమ పర్యటనను ముగించుకుని వాషింగ్టన్ డీసీకి బయల్దేరి వెళ్తారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్న క్రమంలో ఉపాధ్యక్షుడి భారత పర్యటన ఆసక్తికరంగా మారింది. ఇక ఉషా వాన్స్ సెకండ్ లేడీ హోదాలో తొలిసారి భారత్కు వచ్చారు. ఆమె తల్లిదండ్రులు క్రిష్ చిలుకూరి, లక్ష్మీ చిలుకూరి 1970 చివరలో భారత్ నుంచి అమెరికాకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఉషా వాన్స్ అక్కడే జన్మించారు.
#WATCH | Delhi: Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children, at Palam airport.
Vice President JD Vance is on his first official visit to India and will meet PM Modi later today. pic.twitter.com/LBDQES2mz1
— ANI (@ANI) April 21, 2025
#WATCH | Delhi: Vice President of the United States, JD Vance, Second Lady Usha Vance, along with their children welcomed at Palam airport.
Union Minister Ashwini Vaishnaw received the Vice President. pic.twitter.com/ocXCXOdmgQ
— ANI (@ANI) April 21, 2025
Also Read..
Maoists | జార్ఖండ్లో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి