Maoists | జార్ఖండ్‌లో ఎన్కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి
జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టులు (Maoists) మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున బొకారో జిల్లాలోని లాల్పానియా ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నరన్న సమాచారంతో సీఆర్పీఎఫ్కు చెందిన 209 కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (కోబ్రా) దళాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు.
బొకారో: జార్ఖండ్‌లోని బొకారో జిల్లాలో మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు (Maoists) మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున బొకారో జిల్లాలోని లాల్పానియా ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నరన్న సమాచారంతో సీఆర్పీఎఫ్కు చెందిన 209 కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (కోబ్రా) దళాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఉదయం 5.30 గంటల సమయంలో లుగు కొండల ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారని సీఆర్పీఎఫ్ అధికారులు వెల్లడించారు. మృతులను గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఘటనా స్థలంలో ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ రైఫిళ్లతోపాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించారు.
కాగా, ఈ నెల 14న జార్ఖండ్‌లోని పశ్చిమ సింఘ్భమ్ జిల్లాలో 11 మావోయిస్టు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా బాక్రబేదా అటవీ ప్రాంతంలో రెండు ఐఈడీలను గుర్తించారు. వాటిని బాంబు స్కాడ్ సిబ్బంది నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

