Nepal | రాచరికం మళ్లీ రావాలి.. నేపాల్‌లో భారీ నిరసనలు
నేపాల్‌లో మళ్లీ రాచరిక పాలన రావాలని వందలాది మంది కాఠ్మాండూలో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటు, ప్రధాన మంత్రి నివాసం ఉన్న హై సెక్యూరిటీ జోన్ సమీపంలో రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీకి చెందిన దాదాపు 1,500 మంది ధర్నా చేశారు.
- హిందూ దేశంగా నేపాల్‌ను ప్రకటించాలని డిమాండ్
- కాఠ్మాండూలో రోడ్లపైకి వందలమంది
Nepal | కాఠ్మాండూ: నేపాల్‌లో మళ్లీ రాచరిక పాలన రావాలని వందలాది మంది కాఠ్మాండూలో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటు, ప్రధాన మంత్రి నివాసం ఉన్న హై సెక్యూరిటీ జోన్ సమీపంలో రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీకి చెందిన దాదాపు 1,500 మంది ధర్నా చేశారు. ‘గణతంత్ర విధానం నశించాలి’, ‘రాచరికం మళ్లీ రావాలి’, ‘నేపాల్‌ను హిందూ దేశంగా ప్రకటించాలి’ అంటూ నినాదాలు చేశారు. ఆర్పీపీ చైర్మన్ రాజేంద్ర లింగ్డెన్, సీనియర్ నేతలు పశుపతి షంషేర్ రాణా, మాజీ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ధ్రుబ బహదూర్ ప్రధాన్ తదితరులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు.
ఈ నేపథ్యంలో కాఠ్మాండూలోని కీలక ప్రాంతాల్లో వేలాది మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది. అనుమతిలేని ప్రదేశాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆర్పీపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నేపాల్ ప్రతినిధుల సభలో ఆర్పీపీ ఐదో అతి పెద్ద పార్టీ. పోలీసులు అరెస్ట్ చేసిన తమ నేతలను వెంటనే విడుదల చేయాలని ఈ పార్టీ డిమాండ్ చేసింది. తమ నిరసనలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

