Aishwarya-Abhishek | బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) విడాకులు తీసుకోబోతున్నారంటూ (Separation Rumours) గత కొంత కాలంగా వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై ఇద్దరూ ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. కానీ, ఇద్దరూ కలిసి పలు ఈవెంట్స్‌లో పాల్గొని సందడి చేస్తున్నారు. తాజాగా విడాకుల వార్తలకు ఐశ్వర్య రాయ్ బచ్చన్ చెక్ పెట్టారు.
తమ 18వ వివాహ వార్షికోత్సవం (wedding anniversary) సందర్భంగా భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్యతో కలిసి ఉన్న ఫొటోను ఐశ్వర్య షేర్ చేశారు. దీనికి వైట్ హార్ట్ ఎమోజిని జతచేశారు. దాదాపు ఏడాది తర్వాత ఆమె తన భర్తతో ఉన్న ఫొటోను షేర్ చేయడం ఇదే తొలిసారి. తాజా పోస్ట్‌తో విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టినట్లైంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు, అభిమానులు ఐశ్వర్య – అభిషేక్ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాగా, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ జంట విడాకులు తీసుకోబోతున్నదంటూ గతకొన్ని రోజులుగా వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. అభిషేక్ నటి నిమ్రత్ కౌర్‌తో రిలేషన్లో ఉన్నాడని.. ఈ క్రమంలోనై ఐష్ నుంచి విడిపోనున్నట్లుగా బాలీవుడ్ కోడై కూస్తున్నది. ఈ క్రమంలోనే ఏ పార్టీకి హాజరైనా బచ్చన్ ఫ్యామిలీ కుటుంబంతో సహా హాజరవుతున్నా.. ఐశ్వర్య మాత్రం కూతురు ఆరాధ్యతో కలిసి వేరుగా హాజరవడం ఈ వార్తలకు మరింత ఆజ్యంపోసినట్లయ్యింది. అలాగే, ఒక్కగానొక్క కూతురు ఆరాధ్య బర్త్ డే వేడుకలకు సైతం అభిషేక్ దూరంగా ఉన్నాడు. దీంతో ఈ జంట త్వరలో విడాకులు తీసుకోవడం ఖాయం అని అందరూ భావించారు. ఈ వార్తల వేళ ఐశ్వర్య-అభిషేక్ జంట ఫ్యామిలీ ఫంక్షన్స్‌కు హాజరవుతూ రూమర్స్‌కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఇన్‌స్టా పోస్ట్‌తో ఆ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్లైంది. ఇప్పటికైనా ఈ రూమర్స్ ఆగుతాయో లేదో చూడాలి మరి.
అభిషేక్- ఐశ్వర్యరాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. 2011లో ఈ జంటకు ఆరాధ్య జన్మించింది. ఇటీవల ఆరాధ్య 13వ పుట్టిన రోజును తల్లి ఐశ్వర్యతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నది. అయితే, బర్త్‌డే పార్టీ వేడుకల్లో అభిషేక్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఐశ్వర్య ఆరాధ్య పుట్టిన తర్వాత ఐదేళ్లు సినిమాలకు దూరంగా ఉంది. 2015లో జబ్బా సినిమాలో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. గత కొన్నేళ్లుగా ఎంపిక చేసిన చిత్రాల్లో మాత్రమే నటిస్తూ వస్తున్నది. సర్బ్జిత్, ఏదిల్ హై ముష్కిల్, ఫన్నీ ఖాన్, పొన్నియన్ సెల్వన్ తదితర ఫ్రాంచైజీల్లో నటించింది.
Also Read..
“Aishwarya-Abhishek | రూమర్స్‌కు చెక్.. ఒకే ఫ్రేమ్‌లో ఐశ్వర్య – అభిషేక్ జంట.. ఫొటోలు వైరల్”